కీచక ప్రిన్సిపాల్.. కౌగిలించుకుంటే ఒత్తిడి తగ్గుతుందని పాడు పనులు.. పోక్సో కేసు ఫైల్

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌ ప్రిన్సిపాల్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. జూలై 26న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు రోజు ఏడో తరగతి క్లాస్‌కు వెళ్లిన ప్రిన్సిపాల్.. బెస్ట్ స్టూడెంట్ తనేనని అమ్మాయిని ప్రశంసించాడు.

కీచక ప్రిన్సిపాల్.. కౌగిలించుకుంటే ఒత్తిడి తగ్గుతుందని పాడు పనులు.. పోక్సో కేసు ఫైల్
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌ ప్రిన్సిపాల్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. జూలై 26న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు రోజు ఏడో తరగతి క్లాస్‌కు వెళ్లిన ప్రిన్సిపాల్.. బెస్ట్ స్టూడెంట్ తనేనని అమ్మాయిని ప్రశంసించాడు. ఫేవరేట్ స్టూడెంట్‌ను హగ్ చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుందని తెలిపాడు. నెక్స్ట్ డే స్కూల్ అయిపోయే సమయంలో స్నేహితురాలితో కలిసి ఓ పని మీద స్టోర్ రూమ్‌కు వెళ్లింది ఈ అమ్మాయి. అక్కడకు వచ్చిన ప్రిన్సిపాల్ స్నేహితురాలిని వెళ్లిపోమన్నాడు. ఆ అమ్మాయిని కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో.. వ్యతిరేకించింది. దీంతో బయట ఈ విషయాన్ని చర్చిస్తే చంపేస్తానని బెదిరించాడు.

దీంతో కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఆమె.. ఆగస్టు 11న తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులను ఆశ్రయించారు. కాగా ప్రిన్సిపాల్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసిన పోలీసులు.. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు ఇన్ఫర్మ్ చేశారు.

Next Story