- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్టిక్ డమ్మీకి అంత్యక్రియలు.. విషయం తెలిసి షాకైన పోలీసులు
బీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ప్లాస్టిక్ డమ్మీకి అంత్యక్రియలు చేసేందుకు యత్నించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రహ్ ముక్తేశ్వర్ గంగా ఘాట్ లో వెలుగు చూసింది.

దిశ, వెబ్‌డెస్క్: బీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ప్లాస్టిక్ డమ్మీకి అంత్యక్రియలు చేసేందుకు యత్నించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రహ్ ముక్తేశ్వర్ గంగా ఘాట్ లో వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు అంత్యక్రియలు చేసేందుకు కర్రలతో చితిని సిద్ధం చేయగా.. అక్కడున్న ఒక వ్యక్తికి ఏదో అనుమానం కలిగింది. దీంతో వేరే అంత్యక్రియలు వచ్చిన వ్యక్తులు పాడెపై కప్పి ఉన్న దుప్పటిని తీసి చూడగా.. డమ్మీ బొమ్మ కనిపించింది. దానిని చూసి అక్కడున్న వారంతా షాకయ్యారు. ఆ డమ్మీని తీసుకువచ్చిన ఇద్దరు యువకులను పట్టుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
శ్మశాన వాటికకు చేరుకున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డమ్మీకి అంత్యక్రియలు చేయడంపై విచారించగా.. తమ పేరుపై ఉన్న రూ.50 లక్షల బీమా డబ్బును పొందేందుకు ఇలా చేస్తున్నట్లు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. డమ్మీకి అంత్యక్రియలు చేసి, అది తన మరణంగా చూపించి డబ్బు పొందాలని ప్లాన్ చేసినట్లు చెప్పాడు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా లేక ఏదైనా నేరం నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నారు.






