- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగని పైరసీ దందా.. ఒక్కరోజులోనే అక్కడ ప్రత్యక్ష్యం!
ఐబొమ్మ(Ibomma), బప్పం సైట్లు బ్లాక్ అయినా పైరసీ దందా ఆగడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ(Ibomma), బప్పం సైట్లు బ్లాక్ అయినా పైరసీ దందా ఆగడం లేదు. మూవీ రూల్జ్ వెబ్‌సైట్ రూపంలో ఇంకా ఇండస్ట్రీని ఈ సమస్య వేధిస్తోంది. తాజాగా శుక్రవారం రిలీజైన సినిమాలు కూడా మూవీ రూల్జ్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. అల్లరి నరేశ్ నటించిన 12ఏ రైల్వే కాలనీ సినిమా, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే సినిమాలను మూవీ రూల్జ్ వెబ్‌సైట్(Movie Rules Website) పైరసీ చేసి.. విడుదలైన మరునాడే వెబ్‌సైట్‌లో హెచ్‌డీ ప్రింట్ పెట్టడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, మూవీ రూల్జ్ నిర్వాహకుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు.. ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3వ రోజు కస్టడీలో భాగంగా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను స్వయంగా విచారించారు. అయితే, చాలా వరకూ రవి.. పోలీసులకు సహకరించకుండా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. రవి ఉపయోగించిన సర్వర్లపై పోలీసులకు ఇంకా స్పష్టత రానట్టు సమాచారం. దీంతో ఎథికల్ హ్యాకర్‌ల సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు అడుగులు వేస్తున్నారు.






