- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ టీవీ జర్నలిస్ట్
ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మూర్తిపై కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలను టెలికాస్ట్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో మూర్తిపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మూర్తిపై కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలను టెలికాస్ట్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో మూర్తిపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట తనతో ఉన్న విభేదాల కారణంగా మహష్ పై అతడి భార్య గౌతమి జర్నలిస్ట్ మూర్తితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ధర్మ మహేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాలతో గౌతమి చౌదరిని A1, మూర్తిని A2గా చేరుస్తూ కూకట్‌పల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే ధర్మ మహేశ్ డ్రింకర్ సాయి, సింధూరం సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరిని అతడు వివాహం చేసుకోగా ఇద్దరి మధ్య విభేదాల కారణంగా దూరం అయ్యారు. ఈ క్రమంలో గౌతమి, ధర్మ మహేశ్ తరచూ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల కూడా ధర్మ మహేశ్ మూర్తిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ఇప్పుడు కోర్టును ఆశ్రయించడంతో ఏం జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.






