- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు రౌడీషీటర్లు, ఓ మైనర్ అరెస్ట్
తెల్లవారుజామున ఫోన్ చూస్తున్న ఓ క్యాబ్ డ్రైవర్‌ను లక్ష్యంగా చేసుకుని ఫోన్ స్నాచింగ్ చేసిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు రౌడీషీటర్లు,

దిశ, సిటీ క్రైం : తెల్లవారుజామున ఫోన్ చూస్తున్న ఓ క్యాబ్ డ్రైవర్‌ను లక్ష్యంగా చేసుకుని ఫోన్ స్నాచింగ్ చేసిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు రౌడీషీటర్లు, ఒక మైనర్‌ను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 28వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిలకలగూడ క్రాస్‌రోడ్స్ సమీపంలో క్యాబ్ డ్రైవర్ దుర్గారావు బుకింగ్ డిటెయిల్స్ చూస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని యువకులు అతని చేతిలో నుంచి ఫోన్‌ను స్నాచింగ్ చేసి పరారయ్యారు.
ఈ ఘటనపై బాధితుడు గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు 50కు పైగా సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితులను చిలకలగూడకు చెందిన రౌడీషీటర్లు మదన రవితేజ, బల్లా నాగచెన్న కేశవరావు అని గుర్తించారు. వారి వెంట ఉన్న మైనర్‌ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి విచారణలో నిందితులు రాత్రి సమయంలో ఓ ఇంట్లో చొరబడి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలను కూడా చోరీ చేసినట్లు వెల్లడైంది. అదనంగా, ఈ ఇద్దరు రౌడీషీటర్లు గతంలో హత్య, హత్యాయత్నం కేసుల్లోనూ అనుమానితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.






