- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol Bomb: భద్రాద్రి జిల్లాలో సంచలనం.. ఏరియా ఆసుపత్రిపై పెట్రోలు బాంబు దాడి
తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/భద్రాచలం: తెలంగాణలో మరో సంచలనం చోటుచేసుకుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. సూపరింటెండెంట్ టార్గెట్‌గా చేసుకుని ఆయన ఛాంబర్‌పై పెట్రో బాంబులు విసిరారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని రోగులు బయటకు పరుగులు తీశారు. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణను ‘దిశ’ వివరణ కోరగా.. అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తలుపు కింద నుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించారని తెలిపారు. దీంతో కార్యాలయంలో కొంత ఫర్నిచర్ దగ్ధం అయిందని, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. తన ఛాంబర్ దగ్గరలో రోగులు ఎవరూ ఉండరని, కొంతమేర ఫర్నిచర్ తప్ప ఈ దాడిలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. పెట్రోల్ బాంబుతో దాడి జరిగిందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అయితే, ఘాతుకానికి పాల్పడిన వారు సూపరింటెండెంట్‌ను లక్ష్యంగా చేసుకుని నిప్పంటించారా.. లేక ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తులు ఇది చేశారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.






