- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
by Kema Shiva Kumar |
శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

X
దిశ, శంకరపట్నం: శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరీంనగర్ మండలము బొమ్మకల్ గ్రామానికి చెందిన భక్తిని అంజయ్య , భార్య అనసూయ బొమ్మకల్ నుంచి శంకరపట్నం మండలం ముత్తారం తన కూతరు ఇంటికి జాతర నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజయ్యకు తీవ్ర గాయాలు కాగా, స్థానికుల సాయంతో 108 సిబ్బంది ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలెట్ ఖాజా ఖలీల్ ఉల్లా స్పందించి కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story






