చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..

by I. Sairam |

జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..
X

దిశ, ఉండవెల్లి: జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామానికి చెందిన కృష్ణయ్య కొడుకు శేఖర్ (27) వంట మాస్టర్ గా పనిచేస్తూ భార్య సువర్ణ, పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. సంసార విషయంలో భార్య భర్తలు గొడవ పడుతూ ఉండేవారు. జనవరి 29న శేఖర్ గద్వాలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి అలంపూర్ చౌరస్తా లోని పెట్రోల్ బంక్ వద్ద పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. శేఖర్ ను కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మృతి చెందినట్లు భార్య సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story