ఆ జిల్లాలో వితంతు పెన్షన్ కుంభకోణం

by Sujitha Rachapalli |

వితంతు పెన్షన్ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిగింది. భర్తలు బతికి ఉండానే వితంతు పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించబడింది. సౌత్ ఎస్పీ అన్షికా వర్మ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయగా.. ఇందులో సీవో నితిన్ కుమార్,

ఆ జిల్లాలో వితంతు పెన్షన్ కుంభకోణం
X

దిశ, వెబ్ డెస్క్ : వితంతు పెన్షన్ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిగింది. భర్తలు బతికి ఉండానే వితంతు పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించబడింది. సౌత్ ఎస్పీ అన్షికా వర్మ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయగా.. ఇందులో సీవో నితిన్ కుమార్, అయోప్లా పీఎస్ ఇంచార్జీ కేవీ సింగ్ ఉన్నారు. సుమారు ఐదు నెలల పాటు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా.. గతవారం డీఎంకు నివేదిక సమర్పించారు. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలో మహిళా సంక్షేమ శాఖలో వితంతు కుంభకోణం గురించి నివేదిక సమర్పించగా.. జిల్లా మెజిస్ట్రేట్ సీరియస్‌గా తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం పోలీసులను పంపించారు. 25 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. మోసానికి పాల్పడిన మధ్యవర్తులు, ధృవీకరణ సిబ్బందిపై విరుచుకుపడేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ మహిళలందరి పేపర్లు, బ్యాంకు ఖాతాలు, సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

2023లోనూ ఇలాంటి 34 కేసులు వెలుగులోకి రాగా గతేడాది నవంబర్ 4న మరో పెద్ద కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. 34 మంది మహిళలు తప్పుగా పెన్షనలు అందుకుంటున్నారని తేలింది.

Next Story