- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తీ మర్డర్ కేసు.. నిందితులు అరెస్ట్
by Ajay Maddhiboyina |
పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి చోటా పూర్‌లో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. జునైద్ అనే యువకుడిని దుండగులు

X
దిశ, వెబ్ డెస్క్: పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి చోటా పూర్‌లో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. జునైద్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ దారుణంతో పాతబస్తీ ఉలిక్కిపడగా 24గంటల్లోపే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమర్, అలీ అనే ఇద్దరు ఇద్దరు జునైద్ ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఓ ఇంటి అమ్మకం విషయంలో కొంతకాలంగా జునైద్, ఒమర్ మధ్య విభేదాలు తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించుకేనేందుకు పిలిచి మాట్లాడుతున్న సమయంలో ఒమర్, అలీ ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు నిర్దారించారు. దాడి తరవాత కొనప్రాణాలతో ఉన్న జునైద్ ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






