బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడికి దేహశుద్ది

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-07 14:36:27  IST  )

బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడికి దేహశుద్ది
X

దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మంలోని ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికలను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో దాడి చేశారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది ఇలా ఉండగా పాఠశాలలో బాలిక ప్రవర్తన పట్ల మందలించడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయునిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది

Next Story