పానీపూరి తిని తండ్రి, ఇద్దరు కొడుకులు మృతి

by Sujitha Rachapalli |

బీహార్‌ రాజధాని పాట్నాలో విషాదం చోటు చేసుకుంది. సిగోరి పీఎస్ పరిధిలో ఉన్న కర్హరా గ్రామంలో పానీపూరి తిన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తండ్రి నీరజ్, కొడుకులు నిర్భయ్ కుమార్, నిర్మల్ కుమార్ పాలిగంజ్‌లోని చందౌస్‌లో v

పానీపూరి తిని తండ్రి, ఇద్దరు కొడుకులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌ రాజధాని పాట్నాలో విషాదం చోటు చేసుకుంది. సిగోరి పీఎస్ పరిధిలో ఉన్న కర్హరా గ్రామంలో పానీపూరి తిన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తండ్రి నీరజ్, కొడుకులు నిర్భయ్ కుమార్, నిర్మల్ కుమార్ పాలిగంజ్‌లోని చందౌస్‌లో జాతరకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ పానీపూరి తిన్నారు. ఇంటికి వచ్చాక భోజనం చేసి హాయిగా పడుకున్నారు. కానీ రాత్రి ముగ్గురికి అకస్మాత్తుగా కడుపు నొప్పి ప్రారంభమైంది. పరిస్థితి విషమించి నిర్మల్ కుమార్ చనిపోయాడు. ఆ తర్వాత నిర్భయ్, నీరజ్‌ను ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందించారు. కానీ చికిత్స పొందుతూనే ఆ ఇద్దరు కూడా మరణించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లనే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Next Story