భార్య ప్రియుడితో కలిసి జీవించాలని తీర్పు.. చీకట్లో ఏం జరిగింది?

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-06 18:15:00  IST  )

ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లా మనియర్ గ్రామంలో షాకింగ్ తీర్పు ఇచ్చింది పంచాయతీ. అన్ను రాజ్ భర్, ముఖేశ్ రాజ్ భర్‌కు ఈ ఏడాది మే 28న పెళ్లి జరిగింది. కానీ అన్ను తన ప్రియుడు బిర్బల్‌ను కలవకుండా ఉండలేకపోయింది.

భార్య ప్రియుడితో కలిసి జీవించాలని తీర్పు.. చీకట్లో ఏం జరిగింది?
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లా మనియర్ గ్రామంలో షాకింగ్ తీర్పు ఇచ్చింది పంచాయతీ. అన్ను రాజ్ భర్, ముఖేశ్ రాజ్ భర్‌కు ఈ ఏడాది మే 28న పెళ్లి జరిగింది. కానీ అన్ను తన ప్రియుడు బిర్బల్‌ను కలవకుండా ఉండలేకపోయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 31న రహస్యంగా కలుసుకోగా.. గ్రామస్తులు పట్టుకున్నారు. మంచానికి కట్టేసి కొట్టారు. తెల్లారి పంచాయితీ పెట్టగా.. భార్య తనను చంపేస్తుందని, కాపాడాలని కోరాడు భర్త. గంటలపాటు పంచాయతీ కొనసాగాక.. ముఖేశ్ ఆమెను తిరిగి స్వీకరించేందుకు నిరాకరించడం.. వ్యభిచారం, ఆయన భద్రత సమస్యల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వివాహాన్ని రద్దు చేయాలని కోరాడు. మరోవైపు అన్ను తండ్రి కూడా ఆమెను తిరిగి తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో గ్రామ పెద్ద కమలేశ్ సింగ్ ప్రియుడితోనే భార్య జీవించాలని తీర్పునిచ్చాడు. అన్ను, ఆమె ప్రియుడితో రాతపూర్వక ఒప్పందం చేసి సంతకం చేయించారు.

Next Story