- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో పంచాయతీ కార్మికుడి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ గ్రామ పంచాయతీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, తాడ్వాయి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ గ్రామ పంచాయతీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం సజీవులు (37) పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సజీవులు ఇటీవల నూతనంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టగా.. దానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తాడ్వాయి గ్రామ శివారులో పురుగుల మందు తాగారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆయన తీవ్రంగా వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సజీవులు మృతి చెందారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. మృతుడి తల్లి రాధవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






