- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో పాకిస్థానీ యువకుడి రాసలీలలు..ఒకరిని ప్రేమించి మతం మార్చి మరో అమ్మాయితో!
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థానీ యువకుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన ఫహద్ అనే యువకుడు 2016 మార్చిలో కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థానీ యువకుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన ఫహద్ అనే యువకుడు 2016 మార్చిలో కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి తరవాత కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. వీరిద్దరూ గతంలో హైటెక్ సిటీలోని సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కీర్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు. తరవాత వీరిద్దరూ బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో నివాసం ఉంటుండగా ఫహద్ తాను పనిచేస్తున్న కంపెనీలో మరో మహిళతో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫహద్, మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
1988లో ఫహద్ హైదరాబాద్ కు వచ్చి స్థిరపడినట్టు తెలుస్తోంది. అమ్మాయిల మతం మార్చి ప్రేమ, పెళ్లి పేరుతో ఫహద్ మోసాలకు పాల్పుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ... తనను ఫహద్ ప్రేమించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పాకిస్థానీ అని చెప్పకుండా నమ్మించాడని చెప్పింది. పెళ్లి చేసుకున్న తరవాత మతం మార్చి డబ్బులు తేవాలంటూ వేధించేవాడని, కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురును కూడా బలవంతంగా మతం మార్చాడని తెలిపింది. ఇప్పుడు మరో అమ్మాయితో ఉంటున్నాడని ఆరోపించింది. తన పేరు మీద రూ.20 లక్షల వరకు లోన్ తీసుకున్నాడని చెప్పింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిపిన సెర్చ్ తరవాత అతడు పాకిస్థానీ అని క్లారిటీ వచ్చిందని తెలిపింది.






