- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోయిడా కార్మిక నిరసనల్లో హింసకు పాక్ కుట్ర.. సోషల్ మీడియా ఖాతాల గుట్టురట్టు
ఏప్రిల్ 13న నోయిడాలో జరిగిన కార్మిక నిరసనల్లో హింసను ప్రేరేపించిన రెండు సామాజిక మాధ్యమ ఖాతాలు పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేయబడినట్లు నోయిడా పోలీసులు గుర్తించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని నోయిడా (Noida)లో ఈ నెల 13న జరిగిన కార్మిక నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింస, విధ్వంసం వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా నోయిడా పోలీసులు గుర్తించారు. నిరసనకారులను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి పాకిస్థాన్ నుంచి రెండు సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ‘X’ (ట్విట్టర) ఖాతాలను ఆపరేట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ‘అనుషి తివారీ’, ‘మీర్ ఇలియాస్ ఇంక్’ అనే పేరుతో ఉన్న ఖాతాల ద్వారా నిరసనల్లో పలువురు కార్మికులు మరణించారంటూ తప్పుడు వార్తలను వ్యాప్తి చేశారు. తద్వారా కార్మికులను హింసకు ప్రేరేపించారు. విచారణలో ఈ ఖాతాలను పాకిస్థాన్ నుంచి వీపీఎన్ VPN (Virtual Private Network) సాయంతో ఆపరేట్ చేస్తున్నట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు ధ్రువీకరించారు.
‘మజ్దూర్ బిగుల్ దస్తా’ అనే బృందానికి చెందిన రూపేష్ రాయ్, మనీషా చౌహాన్, ఆదిత్య ఆనంద్‌లు వేలమంది కార్మికులతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి, వారిని క్షేత్రస్థాయిలో రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, 62 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులపై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద చర్యలు తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారు. డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, స్థానికంగా కార్మికులను సమీకరించి అలజడి సృష్టించేందుకు పక్కా ప్లాన్‌త కుట్ర చేసినట్లుగా నోయిడా పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ తెలిపారు.






