హైదరాబాద్‌లో దారుణం.. సినిమా షూటింగ్స్ ఆశచూపి అనాథ యువతిపై గ్యాంగ్ రేప్

by Naga Rani Yarlagadda |

సినిమా షూటింగ్స్ ఆశ చూపించి అనాథ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన భాగ్యనగరంలో కలకలం రేపింది.

హైదరాబాద్‌లో దారుణం.. సినిమా షూటింగ్స్ ఆశచూపి అనాథ యువతిపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. సినిమా షూటింగుల ఆశచూపించి అనాథ యువతిపై యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. రెండ్రోజుల తర్వాత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ దగ్గర ఇద్దరు అనాథ యువతులు నివాసం ఉంటున్నారు. వారిలో ఓ యువతికి కొందరు యువకులు సినిమా షూటింగ్ ఉంది, ఛాన్స్ ఇప్పిస్తామని నమ్మించి తమతో తీసుకెళ్లారు. సికింద్రాబాద్ లోని తమ గదికి తీసుకెళ్లి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజులపాటు యువతిని బంధించి.. తమ కామవాంఛను తీర్చుకుని.. ఈ నెల 16న ర్యాపిడో బుక్ చేసి యువతిని పంపించేశారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటం గమనించిన మరో యువతి ఏం జరిగిందని అడగడంతో అసలు విషయం చెప్పింది. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు చెప్పి.. ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దాని ద్వారా నిందితుల్ని గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. కాగా.. యువతిపై ఎంతమంది అత్యాచారం చేశారు? అన్న విషయంపై స్పష్టత రావలసి ఉంది. ప్రస్తుతం బాధిత యువతికి వైద్యపరీక్షలు చేయించేందుకు ఆస్పత్రికి తరలించారు.

Next Story