ఆన్ లైన్ స్కామ్ : ఏకంగా రూ. 56 లక్షలు పోగొట్టుకున్న ఎంపీ

by Sujitha Rachapalli |

ఆన్ లైన్ స్కామ్‌లో చిక్కుకుని ఏకంగా రూ. 56లక్షలు పోగొట్టుకున్నాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. స్కామర్లు అతనికి సంబంధించిన రెండు ఎస్బీఐ ఎకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు కాజేశారు.

ఆన్ లైన్ స్కామ్ : ఏకంగా రూ. 56 లక్షలు పోగొట్టుకున్న ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ స్కామ్‌లో చిక్కుకుని ఏకంగా రూ. 56లక్షలు పోగొట్టుకున్నాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. స్కామర్లు అతనికి సంబంధించిన రెండు ఎస్బీఐ ఎకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు కాజేశారు. ఫేక్ కేవైసీ డాక్యుమెంట్లు, పాన్, ఆధార్ కార్డులు ఉపయోగించి యూజ్ చేయకుండా ఉన్న ఎకౌంట్‌ను ఓపెన్ చేసిన సైబర్ క్రిమినల్స్.. పలు లావాదేవీల ద్వారా డబ్బును అందులో నుంచి ట్రాన్స్‌ఫర్ చేశారు. అనుమానాస్పద ట్రాన్జాక్షన్లను గమనించిన బ్యాంక్ అధికారులు.. బెనర్జీ అనధికారిక బ్యాంక్ లావాదేవీల గురించి నిర్ధారించుకున్నాక.. కోల్ కతా సైబర్ క్రైమ్‌ సెల్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మోసగాళ్లకు సంబంధించిన కొన్ని ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేస్తున్నారు.

Next Story