Cyber Crime: అరెస్ట్ వారెంట్‌తో ఆన్లైన్ మోసం

by Gantepaka Srikanth |
Cyber Crime: అరెస్ట్ వారెంట్‌తో ఆన్లైన్ మోసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని ఆన్లైన్ అరెస్టు వారెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. బాధిత వ్యక్తి నుండి రూ.5లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 8420318553 నంబర్ నుండి వీడియో ఫోన్ కాల్ వచ్చింది. మనీ లాడరింగ్ కేసులో ప్రమేయం ఉందని పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి మాట్లాడాడు అని తెలిపారు. సిమ్ కార్డును దుర్వినియోగం చేసి వినియోగిస్తున్నారని ఎల్‌టీ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కాల్ చేసిన వ్యక్తి సూచించాడని తెలిపారు.

కేసులో నుంచి బయట పడాలంటే కొంత మొత్తాన్ని అన్లైన్లో బదిలీ చేయాలని చెప్పాడని తెలిపారు. మోసగాడి మాటలు నమ్మిన బాధితుడు రూ.5 లక్షలు బదిలీ చేశాడు. కొంత సేపటి తరువాత తాను సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసానికి గురైనట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930కి డయల్ చేయండి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed