- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. చికెన్ బిర్యానీ తెచ్చారని చంపేశాడు!
చికెన్ బిర్యానీ తెచ్చాడని చంపేశాడు

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాంచీ(Ranchi)లో విజయ్ కుమార్ నాగ్ అనే వ్యక్తి రెస్టారెంట్ నడుపుతున్నారు. అభిషేక్ సింగ్ అనే వ్యక్తి రెస్టారెంట్‌కు వచ్చారు. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సరిగా గుర్తుంచుకోని రెస్టారెంట్ స్టాఫ్ నాన్-వెజ్(Chicken Biryani) తెచ్చారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన అభిషేక్ సింగ్.. స్టాఫ్‌పై అరిచాడు. దీంతో మాటామాటా పెరిగింది. అంనతరం అక్కడినుంచి వెళ్లిపోయిన అభిషేక్.. కాసేపు అయ్యాక కొందరిని వెంటేసుకొచ్చి గొడవకి దిగారు. తాను వెజ్ బిర్యానీ అడిగితే.. చికెన్ బిర్యానీ ఎలా ఇచ్చావని గొడవ పడ్డారు. ఈ గొడవ పెద్దది కావడంతో.. తుపాకీతో విజయ్ నాగ్‌ను అభిషేక్ కాల్చి చంపాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సినిమా స్థాయిలో ఛేజ్ చేసి అభిషేక్‌ని పట్టుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై స్థానికులు, వ్యాపార వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






