- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బతో వ్యక్తి మృతి..!
by Batti.Sumithra |
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని పూలబజారులో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ అజీజ్ (40) ఆదివారం వడదెబ్బ తగిలి మృతి చెందారు.

X
దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని పూలబజారులో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ అజీజ్ (40) ఆదివారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మహమ్మద్ అబ్దుల్ అజీజ్ మున్సిపాలిటీ కేంద్రంలో పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలడంతో ఇంటికి వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు.
అది గమనించిన కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యుడు దగ్గరికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమిస్తుందని ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారన్నారు. ఖమ్మం వైద్యులు కూడా హైదరాబాద్ తీసుకువెళ్ళాలని సూచించగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చేర్పించారని తెలిపారు. కాగా వైద్యం తీసుకుంటూ అజీజ్ ఆదివారం చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Next Story






