- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ వద్ద పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు రఘు (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

X
దిశ, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ వద్ద పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు రఘు (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు భూపాలపల్లి నుండి పెద్దాపూర్ కు వెళ్లే క్రమంలో 1000 క్వార్టర్స్ కు వెళ్లే మూల మలుపు వద్ద రోడ్డు పక్కనే పోసిన కంకర కుప్ప పై రఘు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయాడు. అదే దారిలో హనుమకొండ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు వేగంగా వెళుతూ మృతుడి తలపై నుంచి వెళ్ళింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. రఘుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






