రాష్ట్రంలో దారుణం.. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై అత్యాచారం చేసిన యువకుడు

by Ajay Maddhiboyina |

మేడ్చల్ జిల్లా అల్వాల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మచ్చ బొల్లారంలో ఓ మహిళతో సహ జీవనం చేస్తున్న దుర్గాప్రసాద్ 34 అనే యువకుడు ఆమె కూతురు 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

రాష్ట్రంలో దారుణం.. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై అత్యాచారం చేసిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా అల్వాల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మచ్చ బొల్లారంలో ఓ మహిళతో సహ జీవనం చేస్తున్న దుర్గాప్రసాద్ 34 అనే యువకుడు ఆమె కూతురు 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణం జరగ్గా.. బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితుడు దుర్గాప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు పూర్తి చేసి రిమాండ్ కు తరలించారు.

ఇక ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మహిళ భర్తను వదిలి మరొకరితో సహజీవనం చేస్తే వావి వరస లేకుండా ఆ మృగాళ్లు ఆమె కూతురిపై కూడా అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. అలాంటి వారిని అడ్డుకోలేక చిన్న‌వ‌య‌సులోనే బాలిక‌లు న‌లిగిపోతున్నారు. దేశంలో పోక్సో లాంటి క‌ఠిన చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా చిన్నారుల‌పై, బాలిక‌ల‌పై మాత్రం దారుణాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో చ‌ట్టాలు మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story