- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..
by Batti.Sumithra |
డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, గండిపేట్ : డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద అంబర్‌పేట నుంచి గచ్చిబౌలీ వెళ్తున్న టాటాఏస్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూసుకువచ్చి అదుపు తప్పి పల్టీలు కొట్టిందని పోలీసులు తెలుపుతున్నారు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






