కారు బైక్ ఢీ.. ఒకరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

by Bhanu |

మండలంలోని కొత్తకొండ గ్రామంలోని సబ్‌స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న

కారు బైక్ ఢీ.. ఒకరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు
X

దిశ భీమదేవరపల్లి: మండలంలోని కొత్తకొండ గ్రామంలోని సబ్‌స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరొకరికి తీవ్రమైన గాయాలు కావడంతో హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన వ్యక్తులు కొత్తపెళ్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మృతుడిని అల శ్రీహరి (27)గా గుర్తించగా, గాయపడినవారు మంచిల్ల వెంకటేశ్వర్లు అని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story