- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైరసీ కేసులో పురోగతి.. ముంబైలో జిగ్నేష్ అరెస్ట్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని పైరసీ చేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని పైరసీ చేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సినిమా కంటెంట్‌ను అనధికారికంగా లీక్ చేసిన కేసులో ముంబైకి చెందిన ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైరసీ కేసులో ముంబైకి చెందిన జిగ్నేష్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు, పక్కా సమాచారంతో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. సినిమాకు సంబంధించిన కీలక దృశ్యాలు లేదా సమాచారం లీక్ అవుతున్నట్లు గుర్తించిన నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' గతంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో జిగ్నేష్‌ను పట్టుకున్నారు. సినిమాను పైరసీ చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.






