- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెబ్ సీరీస్ చూసి ఒకరు.. వీడియో గేమ్ కోసం మరొకరు.. ఆందోళన కలిగిస్తున్న చిన్నారుల వరుస సూసైడ్స్
ఢిల్లీ ఘటన మరువక ముందే తాజాగా బెంగళూరులో మరో బాలుడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ యుగంలో మనిషి అలవాట్లు పూర్తిగా డిజిటల్ గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్నాయి. మూడు పూటల తిండి లేకపోయినా ఉండగలమేమో కానీ 3 నిమిషాల పాటు సెల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలు లేని జీవితాన్ని ఊహించడం కష్టం అనేలా పరిస్థితి మారిపోయిాయి. పెద్దవాళ్ల విషయం అలా ఉంచితే పిల్లల సంగతి మరీ ఆందోళనకరంగా మారుతోంది. సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్, ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో వారి ఆలోచనలకు ఏ మాత్రం అడ్డు చెప్పినా వయలెంట్ గా మారుతున్నారు. క్షణాల్లోనే డేంజర్ డేసిషన్ తీసుకునేందుకు సైతం వెనుకాడటం లేదు. కొన్నేళ్ల క్రితం ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టిన బ్లూవేల్ గేమ్ ఎంతరో యువకుల బలవన్మరణానకి కారణం కాగా తాజాగా వెబ్ సీరిస్ చూసి 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అయితే సెల్ ఫోన్ కు బానిసగా మారిన ఓ పదోతరగతి విద్యార్థి ఢిల్లీలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే ఇప్పుడు ఓ వెబ్ సీరీస్ కారణంగా ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసువకోవడం ఆందోళన కలిగిస్తోంది.
స్వర్గంలో ఉంటానంటూ..
కర్ణాటకలోని బెంగళూరులో (Bangalore) ఏడో తరగతి చదువుతునన గాంధార్ (14) అనే బాలుడు జపనీస్ కు చెందిన డెత్ నోట్ వెబ్ సీరీస్ (Japanese Web Series) కు బాగా ఆకర్షితుడయ్యాడు. ఇందులో ఓ మాయా బుక్ లో ఎవరి పేరు రాసి వారు ఎలా చనిపోవాలని అనుకుంటే ఆ వ్యక్తి అలాగే చనిపోతాడు. ఈ డెత్ నోట్ వెబ్ సీరీస్ ను రెగ్యులర్ గా ఫాలో అయిన గాంధార్ గత సోమవారం ఇంట్లోని గతిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ గదిలో ఓ సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని మాటలను చూసి షాక్ తిన్నారు. 'మీరు నన్ను 14 ఏళ్లు చాలా బాగా పెంచారు. మీతో కలిసి ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖను చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా' అంటూ లేఖ రాసి సూసైడ్ కు పాల్పడ్డాడు. ఓటీటీలోని ఓ వెబ్ సీరీస్ కారణంగా బాలుడు ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
11 గంటల పాటు మొబైల్ ఫోన్ చూస్తూ..
ఢిల్లీలోని అంబికా విహార్ కాలనీలో పదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరిని విస్మయం చెందేలా చేసింది. నంగ్లోయిలోని ఎఁసీడీ స్కూల్ లో చదువుతున్న ఈ బాలుడు గత కొంత కాలంగా వీడియో గేమ్స్ కు బానిస అయ్యాడు. అయితే జులై 31న వర్షం కారణంగా ఆ బాలుడు స్కూల్ కు వెళ్లలేదు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లగా బాలుడు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని ఇనుప పైకున ఉరి వేసుకుని వేలాడుతూ శవమైన కనిపించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు షాకింగ్ విషయాలు గుర్తించారు. ఆరోజున బాలుడు సుమారు 11 గంటల పాటు మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తూనే ఉన్నాడని, అందులో ఏడు గంటల పాటు ఓ వీడియో గేమ్ ఆడగా నాలుగు గంటలు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. వీడియో గేమ్ కు బానిసగా మారి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనలే కాదు సెల్ ఫోన్ ఇవ్వలేదని కొందరు, సెల్ ఫోన్ కోనివ్వలేదని ఆత్మహత్యలకు పాల్పడిన పిల్లలు కొందరైతే తమ కన్న తల్లిదండ్రులనే చంపేసిన వారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి ఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, డిజిటల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.






