Chhattisgarh: మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ కలకలం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-01 08:59:46  IST  )

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం (మార్చి 1) మరోసారి కాల్పుల కలకలం రేగింది.

Chhattisgarh: మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో శనివారం (మార్చి 1) మరోసారి కాల్పుల (firing) కలకలం రేగింది. సుక్మా జిల్లా కిష్టారాం పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists) ఉన్నారని పోలీసులకు సమాచారం అందటంతో శుక్రవారం (ఫిబ్రవరి 28) కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఉదయం నుంచి భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో తరచూ మావోయిస్టులకు భద్రతా దళాల మధ్య కాల్పలు జరుగుతూనే ఉంటాయి. గత కొన్ని నెలల్లో వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోగా, చాలా మంది మావోయిస్టులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్లలో సైనికులు కూడా వీరమరణం పొందారు.

Next Story