- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి రాత్రే ఆ జంటకు చివరి రాత్రి అయ్యింది.. ఆ విషయమే కారణమా?
శోభనం మొదటి రాత్రే ఓ జంట చినిపోయిన ఘటన యూపీలోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: బంధువులు, కుటుంబ సభ్యుల, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఓ యువ జంటకు మొదటి రాత్రే చివరి రాత్రి అయ్యింది. హృదయ విదారకమైన ఈ ఘటన యూపీలోని బహ్రైచ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాకు చెందిన ప్రతాప్ యాదవ్ (20), పుష్ప (20) అనే ప్రేమికులు మే 30న పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలు వారి శోభనానికి ఏర్పాటు చేశారు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో.. మరెన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట శోభనం మొదటి రోజు చనిపోయారు.
దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. కాగా పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. భార్యాభర్తలిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు ఆ రిపోర్టులో వెల్లడైంది. దీంతో కలిసి జీవించిలేకపోయినా కలిసి చనిపోయారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా భార్యాభర్తలిద్దరినీ ఒకే చితిపై పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.






