ఛీ..ఛీ.. వీడు మనిషేనా.. చాక్లెట్లు ఆశ చూపి చిన్నారిపై

by Bhanu |

చిన్నారి మాయ మాటలతో మోసం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ వృద్ధుడిపై పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోక్సో

ఛీ..ఛీ.. వీడు మనిషేనా.. చాక్లెట్లు ఆశ చూపి చిన్నారిపై
X

దిశ, పాలకుర్తి: చిన్నారి మాయ మాటలతో మోసం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ వృద్ధుడిపై పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన పాలకుర్తి మండలం తీగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ పవన్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన పోగు సోమయ్య (65) అనే వృద్ధుడు, తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల చిన్నారిని చాక్లెట్లు ఇస్తానంటూ మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల భద్రతకు సంబంధించి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం.

Next Story