Occult worship: సర్కార్ బడిలో క్షుద్ర పూజల కలకలం.. అర్ధరాత్రి ఏకంగా ఓ మేకను..

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-04 08:34:08  IST  )

దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా.. గ్రామాల్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. మూఢనమ్మకాల వెనుక పరిగెడుతూ.. లేని అతీంద్రియ శక్తులను తమ సొంతం చేసుకునేందుకు కొందరు క్షుద్రపూజలు పాల్పడుతున్నారు.

Occult worship: సర్కార్ బడిలో క్షుద్ర పూజల కలకలం.. అర్ధరాత్రి ఏకంగా ఓ మేకను..
X

దిశ, వెబ్‌డెస్క్/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా.. గ్రామాల్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. మూఢనమ్మకాల వెనుక పరిగెడుతూ.. లేని అతీంద్రియ శక్తులను తమ సొంతం చేసుకునేందుకు కొందరు క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామంతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి క్షద్రపూజలు కలకలం రేపిన భయానక ఘటన సిరిసిల్ల (Sirisilla)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన కుసుమ రామమ్య (Kusuma Ramaiah) అనే వ్యక్తి కొంతమందితో కలిసి సమీపంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో క్షుద్రపూజలకు పాల్పడ్డాడు. అదేవిధంగా ఓ మేకను కూడా బలివ్వబోయినట్లుగా తెలుస్తోంది. అయితే, రోజులాగే ఉదయం 5 గంటల ప్రాతంలో పాఠశాల గేటు తీసిన రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం (Venkatesham) అక్కడున్న కుంకుమ, పసుపు చూసి భయాందోళనకు లోనయ్యాడు. విషయాన్ని స్థానికులతో పాటు ఎంఈవో రఘుపతి (MEO Raghupati) దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు క్షుద్రపూజలకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.

Next Story