- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. ఊహించని నిర్ణయం తీసుకున్న నర్స్
మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే మోసం చేశాడనే మనస్థాపంతో ఓ నర్స్ ఆత్మహత్యకు పాల్పడింది.

దిశ, వెబ్‌డెస్క్ : మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే మోసం చేశాడనే మనస్థాపంతో ఓ నర్స్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగం మానేసి రమ్మని.. ఆ తర్వాత కాపురానికి రాకుండా ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసుకున్నాడని ఈ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఓ హోటల్‌లో విషం తీసుకుని అపస్మారకస్థితిలో ఉన్న నర్సును ఆమె మామ గుర్తించి హాస్పిటల్‌కు తరలించినా ప్రాణం దక్కలేదు. ఈ విషాద ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. మృతిరాలి మామ రాజ్‌బీర్ తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని చంద్రపూర్ బాబైల్ రోడ్డుకు చెందిన మనీషా (22) స్థానికంగా ఇంటర్మీడియట్ వరకు చదివింది. ఆ సమయంలోనే అదే ప్రాంతానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది. రెండేళ్లు ప్రేమించుకున్న ఇద్దరు ఘజియాబాద్‌కు వెళ్లిపోయి ప్రేమవివాహం చేసుకున్నారు. ఇద్దరు అక్కడే మకాం పెట్టి సంసారం ప్రారంభించారు. ఈ పెళ్లి ఇష్టం లేని కుటుంబసభ్యులు కేసు పెట్టడంతో కిడ్నాప్ కేసులో అరెస్టై కొద్ది రోజులు జైలు జీవితం గడిపారు. కుటుంబ సభ్యుల బెయిల్ ఇప్పించడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత భార్యభర్తలు కాపురం పెట్టినా ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మనీషా నర్సు ఉద్యోగంలో చేరింది.
అయితే ఉద్యోగం మానేసి ఇంటికి రావాలని భర్త ఒత్తిడి తేవడంతో జాబ్‌కు రిజైన్ చేసి ఇటీవల బెంగళూరు నుంచి పానిపట్‌కు వెళ్లింది. అక్కడే ఓ హోటల్ రూం తీసుకున్న మనీషా దగ్గరకు భర్త వచ్చాడు. ఇద్దరు కొద్దిరోజులు కలిసి ఉన్న తర్వాత హర్యానాకు వెళ్లి దుస్తులు తీసుకోస్తానని వెళ్లిన భర్త మళ్లీ తిరిగి రాలేదు. ఆయన వెళ్లినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో తనను మోసం చేశాడని మనస్థాపం చెందిన మనీషా ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని విషం ఆర్డర్ చేసుకోని తాగింది.
కుటాని రోడ్‌లోని విహార్ కాలనీలో నివసిస్తున్న మనీషా మామ రాజ్‌బీర్ సమాచారం అందుకుని హూటాహూటిన మనీషా ఉన్న హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటం చూసి వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ జూలై 7 మనీషా మనీషా మరణించింది. సమాచారం అందుకున్న చాందినీబాగ్ పోలీస్ స్టేషన్ అధికారులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సివిల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.






