డెలివరీ బాయ్‌లుగా వచ్చి.. పట్టపగలే బంగారం చోరీ.. యజమాని చెప్తుంది నిజమేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-25 03:55:37  IST  )

గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఓ బంగారం దుకాణంలో భారీ దోపిణీ జరిగింది.

డెలివరీ బాయ్‌లుగా వచ్చి.. పట్టపగలే బంగారం చోరీ.. యజమాని చెప్తుంది నిజమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఓ బంగారం దుకాణంలో భారీ దోపిణీ జరిగింది. డెలివరీ బాయ్ లుగా వచ్చి బంగారం దోచుకెళ్లారని 45 ఏళ్ల నగల వ్యాపారి పోలీసులకు తెలిపాడు. ఒకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీకి సంబంధించిన జాకెట్ ధరించగా.. మరొకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ ట్రాక్ సూట్ ధరించి ఉన్నారని పేర్కొన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో యజమాని కృష్ణ కుమార్ వర్మ తన షాపును హెల్పర్ శుభం కుమార్ (18)కు అప్పజెప్పి బయటకు వెళ్లాడు. "ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణం తలుపు తట్టారని అయినా కుమార్ వెంటనే తలుపులు తెరవలేదని వర్మ చెప్తున్నాడు. వారు తుపాకీ చూపించి బెదిరించి.. 20 కిలోల వెండి, 125 గ్రాముల విలువైన బంగారం, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు వర్మ ఆరోపించారు. దోపిడీకి గురైన బంగారం విలువ సుమారు రూ.35-38 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేశామని, అందులో వర్మ షాపు నుంచి బయటకు వెళ్లినట్లు కనిపించలేదన్నారు. ప్రస్తుతం వర్మను ప్రశ్నిస్తున్నామని, గతంలో అతనిపై నేరచరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.

Next Story