శోభనం రోజే నవవధువు ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..తల్లి దండ్రులకు ఏం చెప్పిందంటే.?

by Ajay Maddhiboyina |

ఏపీలోని సత్యసాయి జిల్లాలో శోభనానికి ముందే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సత్యసాయి జిల్లా సోమందేపల్లికి

శోభనం రోజే నవవధువు ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..తల్లి దండ్రులకు ఏం చెప్పిందంటే.?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని సత్యసాయి జిల్లాలో శోభనానికి ముందే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన కృష్ణ‌మూర్తి, ప‌ద్మావ‌తిల కూతురు హ‌ర్షిత 22తో క‌ర్ణాట‌క‌లోని బాగేప‌ల్లికి చెందిన నాగేంద్రకు సోమవారం వివాహం జ‌రిపించారు. రెండు నెల‌ల క్రిత‌మే వీరి నిశ్చితార్థం జ‌ర‌గ్గా ఈ నెల 4న బాగేప‌ల్లిలో వివాహం జ‌రిపించారు. వివాహం అనంత‌రం శోభ‌నం ఏర్పాట్ల కోసం కొత్త జంట‌ను పెళ్లి కూతురు ఇంటికి తీసుకువ‌చ్చారు.

అయితే ఏం జ‌రిగిందో కానీ అదే రోజు రాత్రి హ‌ర్షిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని త‌ల్లిదండ్ర‌లను విచారించగా షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పెళ్లి జ‌రిగిన రోజు రాత్రి త‌న‌కు పెళ్లి ఇష్టం లేద‌ని హ‌ర్షిత త‌ల్లిదండ్రుల‌కు చెప్పిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. పెళ్లి జ‌రిగిపోయిన త‌ర‌వాత ఈ విష‌యం చెబితే అంద‌రి ముందు ప‌రువు పోతుంద‌ని పేరెంట్స్ హ‌ర్షిత‌కు న‌చ్చ‌జెప్పగా రెస్ట్ తీసుకుంటాన‌ని వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తెలిపారు.

Next Story