- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ వధువు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో నమ్మలేని నిజాలు
భర్త, మామ, ఆడపడుచు వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన యూపీలోని మురాదాబాద్లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భర్త, మామ, ఆడపడుచు వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన యూపీలోని మురాదాబాద్లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో ఆమె ఆవేదనను వెలిబుచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మురాదాబాద్ కు చెందిన అమ్రీన్ జహాన్ (23)కు నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. మురాదాబాద్ లోని అత్తారింట్లోనే అమ్రీన్ ఉంటుండగా.. భర్త బెంగళూరులో వెల్డర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. ఇటీవల అమ్రీన్ కు అబార్షన్ అవ్వగా ఆ తర్వాతి నుంచి వేధింపులు మొదలయ్యాయని వాపోయింది.
ప్రతిరోజూ మామ, ఆడపడుచు తనను ఏదొక విషయంపై తిడుతూ ఉంటారని, తాను తీసుకునే ఆహారం గురించి అంటుంటారని చెప్పింది. అలాగే ఒక్కోసారి తన గదికి కరెంట్ కట్ చేస్తారని, తన భర్తకు కూడా లేనిపోనివన్నీ చెప్పడంతో తనను ఎప్పుడు చనిపోతావంటూ వేధించాడని, వాళ్లిద్దరూ కూడా అదే అడుగుతారని వాపోయింది. అంతేకాక అబార్షన్ సమయంలో అయిన ఖర్చు ఇవ్వాలని అడిగారని, ఇవన్నీ ఇక భరించలేకనే చనిపోతున్నానని వీడియోలో చెప్పిన అమ్రీన్.. చనిపోయాక ఇంతకంటే బాగుంటానంటూ కెమెరా ఎదుటే ప్రాణం తీసుకుంది.
కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోవడానికి ముందురోజు తనకు ఫోన్ చేసి.. బాగా కొడుతున్నారని, తనను కాపాడాలని వేడుకుందంటూ రోధించారు. కూతురి అత్తారింటి వారిపై ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త, మామ, ఆడపడుచులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






