- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై స్థానికులు వ్యక్తం చేస్తున్న ఆందోళన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై స్థానికులు వ్యక్తం చేస్తున్న ఆందోళన మరోసారి చర్చనీయాంశంగా మారింది. నవజాత మగ శిశువు మృతి చెందిన ఘటనతో ఆసుపత్రి సేవలపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయినప్పటికీ అదేమీ లేదని అనారోగ్యం వల్లే నవజాత శిశువు మృతి చెందినట్లు వైద్యులు భూకాయిస్తున్నారు. ఝరాసంగం మండలం, పొట్పల్లి గ్రామానికి చెందిన శిశువు తల్లిదండ్రులు మనోహర, సుదర్శన్ మాత్రం ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందినట్లు ఆరోపించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మనోహరను స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్చగా ఆదివారం ఉదయం 8 గంటలకు మగ శిశువును జన్మనిచ్చింది. మధ్యాహ్నం ఆక్సిజన్ అందని కారణంగా శిశువు మృతి చెందినట్లు వారు ఆరోపించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా అలాంటిదేమీ లేదని ఆక్సిజన్ కొరతలేదని వైద్యాధికారి కిరణ్ పేర్కొన్నారు. అనారోగ్యం కారణాలవల్లే శిశువు మృతి చెందినట్లు వివరించారు. ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి ఘటనపై ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు స్పందించారు. ఆస్పత్రికి చేరుకుని ఘటనపై సమగ్రంగా ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకోవడంతో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ , వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లు సంప్రదించి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ , మాజీ మున్సిపల్ చైర్మన్ తంజీం , మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , గ్రామ సర్పంచ్ తదితరులున్నారు.






