- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కల దాడిలో నవజాత లేగదూడ మృతి..!
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో వీధి కుక్కల దాడికి గురైన అప్పుడే జన్మించిన లేగదూడ తీవ్ర గాయాలతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో వీధి కుక్కల దాడికి గురైన అప్పుడే జన్మించిన లేగదూడ తీవ్ర గాయాలతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మంగలి విఠల్ తన ఆవును గ్రామ సమీపంలోని పశువుల కొట్టంలో మేత వేసి యథావిధిగా వదిలి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో ఆవు మగ లేగదూడకు జన్మనిచ్చింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో వీధి కుక్కలు దూడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శరీరంలోని ఒకవైపు మాంసాన్ని సైతం తినేశాయి. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే మండల పశువైద్యాధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని లేగదూడకు ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా మధ్యాహ్న సమయంలో లేగదూడ మృతి చెందినట్లు రైతు విఠల్ తెలిపారు. ఈ ఘటనపై మండల ఎంపీడీవో మంజులను వివరణ కోరగా, గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఉన్న విషయం వాస్తవమేనని, సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టేలా చూస్తామని తెలిపారు.






