- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్ ఓపెన్ వీడియో రూ.99.. ఫేస్ బుక్‌లో పెయిడ్ గర్స్ ఆఫర్స్
సోషల్ మీడియా మాటున ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చాలా మంది మంచికోసం సోషల్ మీడియాను వాడుతుంటే కొందరు మాత్రం నేర కార్యకలాపాల కోసమే వాడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా మాటున ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చాలా మంది మంచికోసం సోషల్ మీడియాను వాడుతుంటే కొందరు మాత్రం నేర కార్యకలాపాల కోసమే వాడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త చెత్త దందా మొదలైంది. సాధరణంగా బయట కొంతమంది డబ్బు కోసం వ్యభిచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అలాంటి దందానే మొదలైంది. అయితే సోషల్ మీడియాలో నేరుగా కలవకుండా అవతలవారికి ఒళ్లు చూపించి వారిని సంతృప్తి పరుస్తారు అంతే. కొంతమంది డబ్బులు సులభంగా సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
వల వేసేందుకు ముందుగా అబ్బాయిల సోషల్ మీడియా ఖాతాలకు మెసేజ్ లు పంపిస్తుంటారు. ఫుల్ న్యూడ్ వీడియో, సెమీ వీడియో అంటూ దేనికి ఎంత ధర, ఎంత సమయం అనే వివరాలు పంపిస్తారు. అలా వచ్చిన మెసేజ్ చూసి రిప్లై ఇస్తే బుక్ అయినట్టే. ఎందుకంటే వీడియో కాల్ ముసుగులో మరో మోసం కూడా దాగి ఉంటుంది. ఇలా వీడియో కాల్స్ చేసి మాట్లాడుతుంటే రికార్డ్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వీడియో రికార్డ్ చేసిన అనంతరం దానిని తిరిగి పంపి బ్లాక్ మెయిల్ చేస్తారు. అడిగినంతా ఇవ్వకపోతే సోషల్ మీడియాలో షేర్ చేస్తామని హెచ్చరిస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇలాంటి సందేశాలకు, ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






