- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడంబరంగా పెళ్లి.. హనీమూన్ నుంచి అర్థాంతరంగా తిరిగొచ్చిన కొత్త జంట.. సీన్ కట్ చేస్తే
ఎంతో ఆడంబరంగా వారిద్దరికీ పెళ్లి చేశారు పెద్దలు. కానీ తొలిరాత్రి నుంచి ఆ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఎంతో ఆడంబరంగా వారిద్దరికీ పెళ్లి చేశారు పెద్దలు. కానీ తొలిరాత్రి నుంచి ఆ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అతను కాపురానికే పనికిరాడని వధువు తన పెద్దమ్మ వద్ద మొరపెట్టుకోగా..భార్యకు మరో యువకుడితో ఉన్న స్నేహాన్ని భర్త అనుమానించాడు. ఇరు కుటుంబాల పెద్దలు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. హనీమూన్ కు పంపితే అంతా సర్దుకుంటుందనుకోగా.. మధ్యలోనే తిరిగి వచ్చేశారు. కట్ చేస్తే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో గానవి (26), సూరజ్ (29)ల వివాహం అక్టోబర్ 29న అట్టహాసంగా జరిగింది. కానీ నవదంపతుల మధ్య తొలిరాత్రి నుంచి అనుమానం పెనుభూతమైంది. అతను కాపురానికే పనికిరాడని వధువు తన పెద్దమ్మ వద్ద మొరపెట్టుకోగా..భార్యకు మరో యువకుడితో ఉన్న స్నేహాన్ని భర్త అనుమానించాడు. హనీమూన్ కు వెళ్లొస్తే అంతా సర్దుకుంటుందని శ్రీలంకకు 10 రోజులపాటు వెళ్లిరమ్మన్నారు. తీరా వెళ్లాక నాలుగురోజులకే తిరిగొచ్చేశారు. అక్కడ గొడవలు మరింత ఎక్కువ కావడంతో.. ఆదివారమే నగరానికి చేరుకున్నారు. పుట్టింటికి వెళ్లిన గానవి బుధవారం (డిసెంబర్ 24) విషంతాగి ఆత్మహత్యయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది. భార్య చనిపోయిందని తెలుసుకున్న సూరజ్.. తన తల్లి, తమ్ముడు సంజయ్ తో కలిసి మహారాష్ట్రలోని నాగపూర్ కు వెళ్లిపోయాడు. లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. గానవి చనిపోవడంతో తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో సూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న బాధతో తల్లి జయంతి ఆత్మహత్యాయత్నం చేసింది. సంజయ్ చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






