- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
73ఏళ్ల వృద్ధుడి పోర్న్ సరదా.. బలిపశువుగా మారిన నెదర్లాండ్స్ యువరాణి
నెదర్లాండ్స్ యువరాణి కాథరీనా-అమాలియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఆ దేశానికి కాబోయే రాణిని లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ స్కామ్ జరగడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : నెదర్లాండ్స్ యువరాణి కాథరీనా-అమాలియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఆ దేశానికి కాబోయే రాణిని లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ స్కామ్ జరగడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి.. ఆమె ఫేస్‌ను అశ్లీల కంటెంట్‌కు ఎటాచ్ చేసి.. వీడియోలను మిస్టర్ డీప్ ఫేక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేశారు. ఈ కుంభకోణంతో ప్రిన్సెస్‌తోపాటు మరో 70 మంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా బాధితులుగా మారారు. మొత్తానికి ఎఫ్‌బీఐ అధికారుల సహాయంతో వీడియోలను తొలగించిన డచ్ అధికారులు.. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కానీ 73ఏళ్ల వ్యక్తి ఈ కంటెంట్‌ను క్రియేట్ చేసినట్లు సమాచారం. 2022లోనూ యువరాణికి సంబంధించిన ఇలాంటి వీడియోలు బయటకు రాగా ఇది రెండోసారి కావడం విశేషం. కాగా ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్‌లో రాసిన బ్యాచిలర్ థీసిస్‌లో.. ఇందుకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తెంది. డీప్‌ఫేక్‌కు సంబంధించిన నైతిక, చట్టపరమైన సమస్యలపై చర్చించింది.






