మూడేళ్లుగా ప్రిపరేషన్.. నీట్ రద్దవ్వడంతో విద్యార్థి ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

పేపర్ లీకేజీ కారణంగా నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎంతో కష్టపడి చదివిన కొంతమంది విద్యార్థులు పరీక్ష ర‌ద్దు చేయ‌డంతో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

మూడేళ్లుగా ప్రిపరేషన్.. నీట్ రద్దవ్వడంతో విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: పేపర్ లీకేజీ కారణంగా నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎంతో కష్టపడి చదివిన కొంతమంది విద్యార్థులు పరీక్ష ర‌ద్దు చేయ‌డంతో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంంలోనే రాజస్థాన్ లో ఓ నీట్ అభ్య‌ర్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఝున్ ఝ‌నులోని ఓ పేద కుటుంబానికి చెందిన 22 ఏళ్ల ప్ర‌దీప్ అనే అభ్య‌ర్థి ఇంట్లోని ఓ గ‌ది దాదాపు 3, 4ఏళ్లుగా నీట్ ప‌రీక్ష‌కు సిద్ధం అవుతున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన‌ప్ప‌టికీ డాక్ట‌ర్ కావ‌డమే ప్ర‌దీప్ ల‌క్ష్యంగా పెట్టుకుని చ‌దివాడు. ఈసారి త‌న‌కు 650 మార్కులు వ‌స్తాయ‌ని ఆశించగా పేప‌ర్ లీక్ తో ర‌ద్దు చేశారు.

దీంతో తీవ్ర మాన‌సిక ఆవేద‌న‌కు గురై ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్ర‌దీప్ తండ్రి మీడియాతో మాట్లాడిన మాట‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప‌రీక్ష రాసిన త‌ర‌వాత త‌న కుమారుడు.. ఈ సారి క‌చ్చితంగా మీ అబ్బాయి డాక్ట‌ర్ అవుతాడు.. నాకు 650 మార్కులు వ‌స్తాయి నాన్న అని చెప్పాడ‌ని.. కానీ ఇప్పుడు త‌న కుమారుడే లేకుండా పోయాడ‌ని అభ్య‌ర్థి తండ్రి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు నీట్ ను పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది అనేద ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story