ఎయిర్‌పోర్టులో నార్కోటిక్ బ్యూరో తనిఖీలు. .రూ.40కోట్ల విలువైన గంజాయి సీజ్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో గంజాయి, డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల సర్కార్ ఉక్కపాదం మోపుతోంది.

ఎయిర్‌పోర్టులో నార్కోటిక్ బ్యూరో తనిఖీలు. .రూ.40కోట్ల విలువైన గంజాయి సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో గంజాయి, డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల సర్కార్ ఉక్కపాదం మోపుతోంది. డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department) సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని జాతీయ రహదారులపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ రాత్రి శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (Narcotic Control Bureau) విస్తృతంగా తనిఖీ చేపట్టింది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అందుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.40 కోట్ల వరకు ఉంటుందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story