టాంజానియాలో నల్గొండ వాసి మృతి

by Muthe.Rajitha |

టాంజానియా దేశంలో తెలంగాణ వాసి మృతి చెందాడు.

టాంజానియాలో నల్గొండ వాసి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : టాంజానియా దేశంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన బడుగు రాజు (38) టాంజానియాలో గుండెపోటుతో మరణించాడు. రాజధాని దారుసలాంలో రాజు జియాలాజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కాగా గురువారం విధులు హాజరైన రాజుకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ విషయాన్ని రాజు కొలీగ్స్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి టాంజానియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Next Story