- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడిన మిస్టరీ.. నల్గొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కేసులో వెలుగులోకి సంచలనాలు
నల్గొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసును పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీన (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: నల్గొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసును పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీన (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి బయట తాళం వేసి ఉండగా ఇంట్లో శవాలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. హత్య జరిగిన నాలుగు రోజుల తరవాత పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.
హత్యకు గురైన హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్ల చేత ఈ హత్య చేయించినట్లు పోలీసులు నిర్దారించారు. హసీనాకు గతంలో రెండు పెళ్లిళ్లు జరగ్గా, నల్గొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్‌కు కూడా గతంలో రెండు పెళ్లిళ్లు జరగ్గా.. అతడి మొదటి భార్య పిల్లలు మహ్మద్ ముజమిల్, అక్సరతో కలిసి హసీన నల్గొండలో జీవిస్తోంది.
అయితే హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇళ్లులు ఉండటంతో వాటిని తమకు ఇవ్వకుండా మూడో భర్త సుల్తాన్ పిల్లల పేరు మీద వీలునామా రాస్తానని హసీనా చెప్పడంతో, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే నలుగురు రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో సుల్తాన్ డెడ్ బాడీపై 6చోట్ల, హసీనాపై 7 చోట్ల, కుమార్తె అక్సరపై 9 చోట్ల, ముజమిల్ పై ఏకంగా 16 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. అక్సర మంచం కింద దాక్కుని ఉండగా ఆమెను బయటకు లాగి హత్య చేసి ఉంటారని ఆమె డెడ్ బాడీ సగం మంచం కింద ఉండటం చూసి పోలీసులు అనుమానిస్తున్నారు.






