మంత్రి పొంగులేటి పీఏలమంటూ అధికారులపై ఒత్తిడి.. తీరా చూస్తే ఎంత పెద్ద కేటుగాల్లో తెలుసా?

by Gantepaka Srikanth |

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పీఏ నంటూ ఫోన్​కాల్స్​చేస్తూ ఇద్దరు కేటుగాళ్లు ప్రభుత్వ అధికారులను, పోలీస్​అధికారులను, ఎమ్మెల్యే పీఏను బురిడీ కొట్టించి, వారిపై పలు రకాలుగా ఒత్తిడి పెంచి పనులు చక్కబెట్టుకుంటున్న తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంత్రి పొంగులేటి పీఏలమంటూ అధికారులపై ఒత్తిడి.. తీరా చూస్తే ఎంత పెద్ద కేటుగాల్లో తెలుసా?
X

దిశ, వనస్థలిపురం: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పీఏ నంటూ ఫోన్​కాల్స్​చేస్తూ ఇద్దరు కేటుగాళ్లు ప్రభుత్వ అధికారులను, పోలీస్​అధికారులను, ఎమ్మెల్యే పీఏను బురిడీ కొట్టించి, వారిపై పలు రకాలుగా ఒత్తిడి పెంచి పనులు చక్కబెట్టుకుంటున్న తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పీఏలమంటూ అంటూ ఇద్దరు వ్యక్తులు 9966664882 నంబర్​నుంచి పలువురికి ఫోన్​కాల్స్​చేస్తూ.. తనకు సంబంధించిన పనులు చేసిపెట్టాలని అభ్యర్థిస్తున్నారని, తనకు కూడా కాల్​చేశాడని ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​పీఏ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే మంత్రి శ్రీనివాస్​రెడ్డి తన సిబ్బందితో విచారణ చేయించగా.. సదరు ఫోన్​నంబర్​నాగోల్ పరిధిలోని మమతా నగర్‌లో నివాసముండే బుస్సా వెంకట్​రెడ్డి, మచ్చ సురేశ్ అనే ఇద్దరు వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో గురువారం మంత్రి శ్రీనివాస్​రెడ్డి కార్యాలయ డీపీవో(డేటా ప్రాసెసింగ్​ఆఫీసర్​) పేరాల నరేశ్​నాగోల్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్​చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఐ సూర్యనాయక్ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా, చిట్యాల గ్రామానికి చెందిన బుస్సా వెంకట్​రెడ్డి(34) నిరుద్యోగిగా .. నాగోల్​పరిధిలోని మమతా నగర్‌లో నివాసముంటున్నాడు. నిరుద్యోగిగా ఉంటూ.. ఈజీ మనీకి అలవాటు పైరవీలు మొదలు పెట్టాడు. నాగోల్ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్‌కి చెందిన మచ్చ సురేశ్​(30) ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి పక్కా ప్లాన్‌తో తమ సొంత నంబర్​కాకుండా స్థానికంగా ఎల్​పీజీ గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే తన స్నేహితుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమ్ము వెంకట్​పేరుమీద ఉన్న సిమ్​నంబర్:​9966664882 ను వాడుతున్నారు.

అయితే గత ఏడాది నవంబర్​నుంచి తరుచుగా నగరంలోని ప్రభుత్వ, పోలీసు అధికారులకు, రాజేంద్రనగర్​ఎమ్మెల్యే పీఏ తదితరులకు ఫోన్లు చేస్తూ.. పలు విధాలుగా సాయం అభ్యర్థిస్తూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అదే విధంగా రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​పీఏకు కాల్​చేసి ఓ బీటెక్​విద్యార్థికి లెటర్​ప్యాడ్​ఇవ్వాల్సిందిగా కోరారు. ఆయన కూడా లెటర్​ప్యాడ్​ఇప్పించాడు. అనంతరం ఎమ్మెల్యే పీఏకు మంత్రి పేషీలో పనిసాయం కోసం వెంకట్​రెడ్డికి కాల్​చేయగా.. అతడు ఫేక్​అని తేలింది. దీంతో వెంటనే మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. వెంకట్​రెడ్డి, సురేశ్​ఇప్పటి వరకు మొత్తం 11 మంది ఆయా శాఖల అధికారులకు కి ఫోన్లు చేసి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి పేరు చెప్పి వత్తిళ్లు చేసి, పలు రకాల సాయం అభ్యర్థించినట్లు తేలింది.

Next Story