- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజలింగమూర్తి హత్య కేసులో వీడిన మిస్టరీ.. నిందితుల్లో బీఆర్ఎస్ నేత!
తెలంగాణలో సంచలనం సృష్టించిన భూపాలపల్లి నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసును మిస్టరీని పోలీసులు ఛేదించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన భూపాలపల్లి నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసు (Rajalingamurthy murder case) మిస్టరీని పోలీసులు ఛేదించారు. భూవివాదమే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఓ బీఆర్‌ఎస్ నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరించారు.
భూపాలపల్లి రాజలింగమూర్తికి సంజీవ్ మధ్య గత కొంతకాలంగా ఎకరం స్థలానికై భూవివాదం నడుస్తోంది. ఈ క్రమంలో రాజలింగమూర్తిని హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ప్లాన్ ప్రకారం వరంగల్‌లోని కాశీబుగ్గలో హత్యకోసం కత్తులు, రాడ్లను దుండగులు కొనుగోలు చేశారని తెలిపారు. కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చారని ఎస్పీ అన్నారు. ఈ హత్య కేసు కుట్రలో మొత్తం 10 మంది పాత్ర ఉందన్నారు. A1 రేణిగుంట్ల సంజీవ్, A4 సహా మరో ఇద్దరు వ్యక్తులు హత్యలో నేరుగా పాల్గొన్నారని, మిగతా వాళ్లు వారితో టచ్‌లో ఉన్నట్లు వివరించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే, పరారీలో ఉన్న నిందితుల కోసం ఆరు బృందాలతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






