- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడితో సహజీవనం.. కూతురిని గొంతు పిసికి చంపి.. భర్తను ఇరికించింది.. కానీ ఒక్క మిస్టేక్‌తో..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురును చంపిన తల్లి.. ఆ పాపాన్ని భర్తపై వేసి చేతులు దులుపుకోవాలనుకుంది. కానీ అడ్డంగా దొరికిపోయి జైలు పాలైంది. రోష్ని ఖాన్ అనే మహిళ భర్త షారుఖ్‌తో విడాకులు తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురును చంపిన తల్లి.. ఆ పాపాన్ని భర్తపై వేసి చేతులు దులుపుకోవాలనుకుంది. కానీ అడ్డంగా దొరికిపోయి జైలు పాలైంది. రోష్ని ఖాన్ అనే మహిళ భర్త షారుఖ్‌తో విడాకులు తీసుకుంది. ఏడేళ్ల కూతురిని తన దగ్గరే పెంచుకుంటుంది. తన ప్రేమికుడు ఉదిత్ జైస్వాల్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ ప్రియుడితో రిలేషన్ కంటిన్యూ చేసేందుకు.. భర్తను జైలుకు పంపడానికి పథకం వేసింది రోష్ని. ఇందుకోసం కన్న కూతురిని కడతేర్చి కటకటాల పాలైంది.
షారుఖ్ తన కూతురిని తన వద్ద ఉంచుకోవాలని కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. రోష్ని మాత్రం బిడ్డను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఈ గందరగోళంలో ఆమె తన కూతురిని గొంతు పిసికి చంపి.. ఆ నేరాన్ని భర్త షారుఖ్‌పై నెట్టడానికి ప్రయత్నించింది. కానీ దర్యాప్తులో తల్లే నిందితురాలని తేలింది. పోలీసుల ముందు రోష్ని తన వాంగ్మూలాన్ని పదేపదే మార్చింది. ఒకసారి భర్త రహస్యంగా వచ్చాడని, మరోసారి తలుపు పగలగొట్టాడని చెప్పింది. ఆమె వాదనలు అసంబద్ధంగా, అనుమానాస్పదంగా అనిపించాయి. ఘటనా స్థలంలో బలవంతంగా ప్రవేశించినట్లు, దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్ట్‌మార్టం నివేదికలో గొంతు పిసికి మరణించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు రోష్నిని తమదైన స్టైల్‌లో ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించింది.






