- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నిర్మల్(Nirmal) జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గండి గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య (55) అనే వ్యక్తిని ఈనెల 10న రాత్రి అదే గ్రామానికి చెందిన మూతి నరేశ్ (21), అతని అన్న మల్లేశ్ (23) కలిసి హత్య చేశారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. భీమయ్య కుటుంబ సభ్యుల కంప్లైంట్‌తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భీమయ్య మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో హత్య చేసినట్లు విచారణలో నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






