- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
62ఏళ్ల వృద్ధుడి హత్య.. కానీ 21ఏళ్ల యువకుడి శరీరం.. సంచలనం సృష్టిస్తున్న ఘటన
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 62ఏళ్ల వృద్ధుడి హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ ఆ శరీరం 21 ఏళ్లకు చెందిన యువకుడిదని నిర్ధారించింది. దీంతో కేసు మొత్తం తలకిందులు అయిపోయింది. భార్య మధు తివారి తన భర్త కమలా పతి తివారి

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 62ఏళ్ల వృద్ధుడి హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ ఆ శరీరం 21 ఏళ్లకు చెందిన యువకుడిదని నిర్ధారించింది. దీంతో కేసు మొత్తం తలకిందులు అయిపోయింది. భార్య మధు తివారి తన భర్త కమలా పతి తివారి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టింది. కానీ ఆమె భర్త మృతదేహాన్ని సరిగ్గా గుర్తించకపోవడం వల్ల కేసు మరోసారి సంచలనంగా మారింది. కోర్టు డీఎన్‌ఏ టెస్ట్‌కు ఆదేశించింది.
కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్ ప్రాంతంలోని బృందావన్‌లో నివసించిన కమలా పతి తివారి రైల్వే గార్డుగా చేసి రిటైర్ అయ్యాడు. మంచి పెన్షన్ రావడంతోపాటు ఎనిమిది షాపులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్న కమలా పతి.. వారికి ఆర్థికంగా సహాయం చేయకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. కొడుకు రామ్ జీ తివారీ, అతని స్నేహితుడు రిషభ్ శుక్లాతో కలిసి అతన్ని చంపారనే అనుమానాలు ఉన్నాయి. మార్చి 15న పని మీద బయటకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భయపడిపోయిన భార్య, బంధువులు, స్నేహితులతో కలిసి వెతికింది. కానీ ఆచూకీ లభించలేదు. దీంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. బెలా ప్రాంతంలో రోడ్డు కాలువలో ఓ శవాన్ని గుర్తించిన పోలీసులు.. దాన్ని కమలా పతి తివారి భార్యకు చూపించగా.. ఆమె ఓ పాత ఫొటో ఆధారంగా తన భర్తేనని గుర్తించింది. మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది.
మరోవైపు రామ్ జీ అతని స్నేహితునితో కలిసి తన ఇంటిలోనే గొంతు నులిమి చంపాడని తెలుస్తోంది. శవాన్ని సుమారు 100కిమీ వాహనంలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసినట్లు సమాచారం. కాగా ఆధారాలను నాశనం చేసేందుకు, పోలీసులను పక్కదోవ పట్టించేందుకు.. రామ్ జీ తన తండ్రి ఫోన్‌ను ఫ్రెండ్‌కు ఇచ్చి బీహార్‌లోని జైనాగర్‌కు పంపించాడు. కొంత సేపు అక్కడ ఆన్ చేసి ఆఫ్ చేశాడు. తప్పుడు లొకేషన్ సూచించడం ద్వారా కేసు క్లోజ్ చేస్తారని అనుకున్నాడు కానీ దొరికిపోయాడు. దృశ్యం సినిమా, క్రైమ్ పెట్రోల్ చూసి మర్డర్ ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే పోస్టుమార్టంలో మెయిన్ రిపోర్ట్స్ వృద్ధుడిగా చెప్పినా.. 21ఏళ్ల వయసు అనేది కేసును తలకిందులు చేసింది. తీవ్రంగా గాయాలు కావడం ఇందుకు కారణం అయి ఉండొచ్చు లేదంటే మరొకరి శవం కావచ్చని అనుమానిస్తున్నారు.






