- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు లక్షల అదనపు కట్నం డిమాండ్.. కోడలును గదిలో బంధించి.. పామును వదిలిన అత్తామామలు, భర్త
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కలోనల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం డిమాండ్ నెరవేర్చలేదని కోడలును చంపేందుకు సినిమాటిక్ ప్లాన్ వేశారు భర్త, అత్తామామలు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కలోనల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నంగా ఐదు లక్షలు తీసుకురావాలని డిమాండ్ నెరవేర్చలేదని కోడలును చంపేందుకు సినిమాటిక్ ప్లాన్ వేశారు భర్త, అత్తామామలు. తప్పు తమ మీదకు రాకుండా ఉండేందుకు.. ముందుగా కోడలు తన గదిలో ఉందో లేదో చెక్ చేసుకుని.. ఆ తర్వాత బయట నుంచి లాక్ చేసి.. విష సర్పాన్ని వదిలారు. దీంతో పాము కాటు వేయడంతో ఆమె ఎలాగోలా ఆస్పత్రికి చేరుకుంది. చికిత్స అనంతరం తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. జరిగింది వివరించింది. ఆ తర్వాత భర్త, అత్తామామలపై డొమెస్టిక్ వాయిలెన్స్, మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story






